MDK: మనోహరాబాద్ మండలం గౌతోజిగూడలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు నట్టల నివారణ మందులను శనివారం పంపిణీ చేశారు. సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని పశువులకు మందులు వేయించారు. పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించాలని, గర్భధారణ సమస్యలున్న పశువులకు ప్రత్యేక చికిత్సలు అందించాలని సర్పంచ్ సూచించారు.