KNR: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ ఛైర్మన్గా నియామకమైన అనంతరం తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా శనివారం బెజ్జంకి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డా. కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచా కాల్చారు. జేసీబీ సహాయంతో గజమాలతో ఆహ్వానించారు.