జిడ్డు చర్మం ఉన్నవారు తమ చర్మంపై ఏర్పడే అధిక నూనెని కవర్ చేసుకోవడానికి తరచూ పౌడర్ వాడతారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. పౌడర్ చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల మొటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. అందుకే పౌడర్ వాడటం కంటే సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి జిడ్డుదనాన్ని తగ్గించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.