Ram Charan: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్
రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతున్న విషయం తెలసిందే. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ పెద్ద అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్లో గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రం తెరకెక్కుతుంది. గత సంవత్సరం కాలంగా ఈ సినిమా అప్డేట్ కోసం చరణ్ ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు. తాజగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఓ బిగ్ అనౌన్స్ ఇచ్చారు. జరగండి జరగండి పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకోని రేపు ఉదయం 9 గంటలకు పాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మార్చి 27 చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. వారికి సంబరానికి ఈ పాట తోడు కానుంది.
ఈ సందర్భంగా జరగండి సాంగ్ అనౌన్స్మెంట్లో భాగంగా చరణ్ ఓ కలర్ఫుల్ డ్రెస్ ధరించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.