ప్రకాశం: కందుకూరు మండల పరిధిలో సోమవారం నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు వైద్యశాల సహాయసంచాలకులు చంద్రమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిబిరాలు ఈ నెల 31వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు. ఈ శిబిరంలో పశువులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలన్నారు .