సమంతకు సంబంధించిన న్యూస్ ఒకటి కాస్త ఆలస్యగంగా వెలుగులోకి వచ్చిదిం. అయినా కూడా ఈ వార్త విన్నవారు కాస్త షాక్‌కు గురవుతున్నారు. ఉన్నట్టుండి సినిమా సెట్లోనే కుప్పకూలిందట సామ్. ఇంతకీ ఏ సినిమా సెట్లో ఉన్నప్పుడు?
Samantha: సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఆందోళన పడుతునే ఉంటాఉ. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తునే ఉన్నారు. గతంలో అమెరికాలో ట్రీట్మెంట్ చేసుకున్న సామ్.. ఆ తర్వాత ఇండియాకి వచ్చి చికిత్స చేయించుకుంది. అలాగే ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు వెళ్లింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం దక్షిణ కొరియాకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయినా కూడా ఫైనల్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది కాలం పాట్ సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లింది. పలు వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు హెల్త్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన చాలా ఫిట్‌గా ఉన్నానని చెబుతోంది.
అయితే.. ఇప్పుడో న్యూస్ కాస్త ఆస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పాడ్ కాస్ట్లో భాగంగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది అమ్మడు. ‘మయోసైటిస్ సమస్య క్రమక్రమంగా తగ్గుతుంది అనుకున్నాను.. కానీ మయోసైటిస్ కారణంగా ‘సీటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్లో ఎంతో కష్టంగా అనిపించింది. అప్పటికే శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాను. సిటాడెల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు. అన్నీ తెలిసి కూడా సిరీస్‌కు సైన్ చేశాను. అయితే.. ఓరోజు యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో నా కళ్లు మూత పడ్డాయి. బాగా అలసిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం.. అంటే ఇదేనేమో అనిపించింది. కానీ ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నాను.. ఈసిరీస్ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే నా కెరీర్లో ‘సిటాడెల్’ చాలా స్పెషల్ అని చెబుతాను.. అని చెప్పుకొచ్చింది.