ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర సెట్స్ పై ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా విషయంలోనే ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.
NTR: టైగర్ కెరీర్లోనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దేవర తెరకెక్కుతోంది. అయితే.. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర అనుకోకుండా వాయిదా పడింది. ఏపి ఎలక్షన్స్‌తో పాటు గ్రాఫిక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది. అయితే.. ఇప్పటికే దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. నెక్స్ట్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు ఎన్టీఆర్. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే హృతిక్ రోషన్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఇక ఎన్టీఆర్ ఏప్రిల్ ఫస్ట్ లేవా సెకండ్ వీక్ నుంచి వార్ 2 సెట్లోకి జాయిన్ అవ్వబోతున్నాడట.
ఈలోపు దేవర షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. దేవరలో కేవలం సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంచి.. వార్ 2 కంప్లీట్ చేయనున్నాడట. అయితే.. వార్ 2 మూవీ పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా రాబోతోంది. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. దీంతో ఈ సినిమాలో భారీ స్టంట్స్ ఉన్నాయట. అయినా కూడా ఎన్టీఆర్, హృతిక్ తగ్గేదలే అంటున్నారట. ముఖ్యంగా యంగ్ టైగర్ డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయబోతున్నాడట. దీంతో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా? అని నందమూరి అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. డూప్ లేకుండా ఈ రిస్క్ అవసరమా? అని అంటున్నారు. అయినా కూడా టైగర్ మాత్రం స్వయంగా తానే యుద్ధం చేస్తానని అంటున్నాడట.