»Liver Doc Slams Actor Samantha For Spreading Dangerous Health Misinformation
Samantha : సమంతను జైల్లో పెట్టిస్తానన్న డాక్టర్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సామ్
ఓ సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ వివరాలను ఇన్‌స్టాలో ఉంచారు సమంత. దీంతో ఇలా మందుల వివరాలను పబ్లిక్‌గా చెప్పకూడదని, ఈ విషయమై సమంతను జైల్లో పెట్టిస్తానని ఓ డాక్టర్ ఘాటుగా స్పందించారు. అయితే సమంత కూడా ఈ విషయంలో గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
actor Samantha : సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో ఆమె బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అనేక రకాల వైద్యాలను ప్రయత్నిస్తున్నారు. ఆయుర్వేదం, హోమియో, టిబెటన్ మెడిసన్, ప్రాణిక్ హీలింగ్ లాంటి వాటిని ప్రయత్నిస్తూ వస్తున్నారు. బోలెడు డబ్బును సైతం ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఆమె పరిస్థితి కాస్త మెరుగైనట్లే ఉంది. అందుకనే ఆమె ఓ ట్రీట్మెంట్ వివరాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. అయితే ఈ విషయమై ఓ డాక్టర్ మాత్రం ఘాటుగా స్పందించారు. కొన్ని డేంజరస్ వైద్య పద్ధతులను పబ్లిక్‌గా చెప్పడం సరికాదని అన్నారు. మిస్ ఇన్ఫర్మేషన్లను(misinformation) పాస్ చేయడం తప్పని అన్నారు. ఈ విషయమై తాను సమంతను జైల్లో పెట్టిస్తానంటూ పోస్ట్ చేశారు.
సమంత(Samantha) కూడా ఈ విషయంలో ఘాటుగానే స్పందించారు. అందరి దగ్గరా డబ్బు ఎక్కువగా ఉండదు. కాబట్టి నా ట్రీట్మెంట్ వివరాలు ఎవరికైనా ఉపయోగ పడతాయన్న ఉద్దేశంతోనే తాను ఇలా పబ్లిక్‌గా సమాచారాన్ని పంచుకున్నానని అన్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ తన డాక్టర్ పర్యవేక్షణలో జరిగిందని అన్నారు. ఇలా తనకు వార్నింగ్ ఇచ్చే బదులు, తన డాక్టర్‌తో డిబేట్‌కి వచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు. ఈ మెసేజ్‌తో సదరు డాక్టర్ అనవసరంగా చీప్ అయిపోయారని అన్నారు.
అయితే ఈ విషయంలో నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సమంత(Samantha) సహృదయం గల వ్యక్తి అంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొందరేమో ఆమె చేసిన పనిని సమర్థించడం లేదు. అన్ని మందులూ అందరికీ ఒకేలా పని చేయవని అంటున్నారు. అందుకనే ఇలాంటి వివరాలను పబ్లిక్‌గా చెప్పకపోవడమే మేలని అభిప్రాయ పడుతున్నారు.