విశాఖ సీపీ డా.శంఖబ్రత బాగ్చీని విఎన్ఎస్ (VNS) బృందం మంగళవారం ఘనంగా సన్మానించింది. ‘బెస్ట్ క్రైమ్ డిటెక్షన్’ అవార్డు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, స్నేహ మాక్స్ స్కామ్ నిందితుల అరెస్టులో ఆయన చూపిన తెగువను ప్రతినిధులు కొనియాడారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ మంచి వారికి చేరువ కావాలన్నదే తన లక్ష్యమని అన్నారు.