తరచుగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిలో ఎక్కువగా హెల్త్‌కు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అయితే.. లేటెస్ట్ సామ్ చేసిన ఒక పోస్ట్‌తో డాక్టర్ వర్సెస్ సమంతగా మారిపోయింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతు అనేది ఆసక్తికరంగా మారింది.
Samantha: గత కొంత కాలంగా సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటు వస్తోంది. అయితే.. తాజాగా సమంత చేసిన పోస్ట్ ఒకటి చర్చకు దారి తీసింది. సమంత ఇటీవల మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఈ విషయంలో పలువురు వైద్యులు సమంతపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన సమంత.
తన డాక్టర్ గైడెన్స్‌లో మాత్రమే ఇవన్నీ చేశానని.. సదరు వ్యక్తి తన డాక్టర్‌తో చర్చకు వచ్చి ఉంటే బాగుండేదని.. అతని పై పరోక్ష కామెంట్స్ చేసింది. అలాగే.. దీనికి వివరణాత్మక నోట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ విషయంలో.. సమంతకు మద్దతుగా వరుణ్ ధావన్, కియారా అద్వానీ కియారా సహా పలువురు పోస్ట్‌లు పెట్టారు. అద్వానీ, తాహిరా కశ్యప్, రకుల్ ప్రీత్ సింగ్, మానుషి చిల్లర్ సహా పలువురు ప్రముఖులు సమంత పోస్ట్‌ను లైక్ చేశారు. ఏదేమైనా.. సమంత వర్సెస్ డాక్టర్ అనేది వివాదానికి దారి తీసింది.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. చివరగా విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ప్రస్తుతం తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. సమంత చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది అమ్మడు. ఇప్పుడు రెండు కొత్త సినిమాలకు సమంత సైన్ చేసింది. ఇటీవలె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను అనౌన్స్ చేసింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.