SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో 10వ వార్డులో పలు వీధుల్లో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.