»Raj Tharun Twist In The Case Of Raj Tharun This Is The Real Truth
Raj Tharun: రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. అసలు నిజం ఇదే!
యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడు హీరోయిన్ బయటికొచ్చి అసలు నిజం ఇదేనని చెప్పింది.
Raj Tharun: Twist in the case of Raj Tharun.. This is the real truth!
Raj Tharun: షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ మొదలు పెట్టి.. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ మధ్య హిట్లు పడలేదు కానీ, వరుస సినిమాలు చేస్తునే ఉన్నాడు. ప్రస్తుతం ‘తిరగబడర సామి’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు పిల్లా నువ్వు లేని జీవితం ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్గా నటించింది. రీసెంట్‌గానే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.
ఇదిలా ఉంటే.. రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి తనని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని.. అయితే మధ్యలో ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఇక లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమే కానీ, 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు ఈ కేసు విషయంలో.. ఆధారాలు వెంటనే సమర్పించాలని లావణ్యకు నోటీసులు జారీ చేయగా.. ఆమె కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది.
ఇక.. ఈ కేసులో మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ ప్రమేయం ఉందని.. తనకు కాల్స్ చేసి కూడా బెదిరించిందని లావణ్య ఆరోపంచింది. తాజాగా దీనిపై మాన్వీ మల్హోత్రా స్పందిస్తూ.. రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తన కో స్టార్ మాత్రమేనని అంది. అలాగే.. నేను లావణ్యని బెదిరించలేదు, ఆమెతో అసలు పరిచయం లేదని లిపింది. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా పేర్కొంది. అసలు సినిమా షూటింగ్ ముగిసే సమయంలోనే ఫోన్ చేసి రాజ్ తరుణ్‌కు దూరంగా ఉండమని తను బెదిరించింది. అప్పటి నుంచి ఆరు నెలలుగా రాజ్ తరుణ్‌తో మాట్లాడలేదు. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం మాట్లాడితే ఇలా చేసిందని.. మాల్వీ చెప్పింది. మరి లావణ్య దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి.