డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్టేట్ బయటికొచ్చింది.
Double Ismart: మరోసారి.. ఉస్తాద్ ఇస్మార్ట్ అంటూ థియేటర్లో రచ్చ చేయడానికి వస్తున్నాడు రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. దీంతో.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. రీసెంట్గా రిలీజ్ అయిన ‘స్టెప్పమార్’ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఓల్డ్‌సిటీ శంకర్‌గా రామ్ పాత్ర అదిరిపోతుందని, ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. లైగర్ తర్వాత పూరి చేస్తున్న సినిమా కావడంతో.. డబుల్ ఇస్మార్ట్ పూరికి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు రామ్‌కు కూడా ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకంగా మారింది. కాబట్టి.. పూరి, రామ్ డబుల్ డోస్‌తో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ పైనే భారీ ఆశాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చార్మీ కూడా ఈ సినిమా ఆశలు పెట్టుకుంది.
ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈసారి ఇస్మార్ట్ శంకర్‌కి మించిన మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చినట్టుగా సమాచారం. మరి డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.