ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా జరిమానా విధించింది.
RBI: ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించని కారణంగా జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులుకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు పీఎన్బీపై రూ.1.31 కోట్లు జరిమానా విధించింది. కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచడంలో పీఎన్బీ విఫలమైందని తెలిపింది.
బ్యాంకు పనితీరుపై 2022 మార్చి 30న ఆర్బీఐ తనిఖీ నిర్వహించింది. ఆ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు పాటించని బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు వివరణతో సంతృప్తి చెందని ఆర్బీఐ.. తాజాగా జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎన్బీతో పాటు ఇటీవల గుజరాత్ రాజ్య కర్మచారి కో-ఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకు(బిహార్), నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్(మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది.