TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని ఇవాళ్టి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రభాకర్ రావును HYD సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ టీమ్ లోతుగా విచారించింది.