JGL: పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం ధర్మపురి పట్టణంలో 68 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు, గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేసి కట్టించడం జరుగుతుందన్నారు.