NLG: నల్గొండలోని అనేశ్వరమ్మ గుట్టపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గోమాత మందిరం-గోశాల (వారాహిదేవి, దక్షిణామూర్తి ఆలయం) నిర్మాణానికి పలువురు దాతలు సహకరిస్తున్నారు. ఆలయ నిర్మాణంలో ఎంతో విశిష్టత అయిన ధ్వజస్తంభంను ఇత్తడి తాపడంతో నిర్మాణం చేపడతానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నిర్మాణ కమిటీకి అంగీకారం తెలిపారు.