కృష్ణా: భారత మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మచిలీపట్నం నుంచి కూటమి నేతలు పెద్ద సంఖ్యలో అమరావతి బయలుదేరి వెళ్లారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ప్రతి డివిజన్, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో వేలాది మంది వాజ్ పేయి శత జయంతి కార్యక్రమానికి తరలి వెళ్లారు.