E.G: 2027లో గోదావరి పుష్కరాల దృష్ట్యా గౌతమీ జీవకారుణ్య సంఘం సత్రం పునర్నిర్మాణం, వంటగది బ్లాక్ కోసం ప్రభుత్వం రూ. 2.80 కోట్లు మంజూరు చేసిందని MLA వాసు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం ఛైర్మన్ వర్రే శ్రీనివాసరావు, డైరెక్టర్లు బుధవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులకు ఉత్తమ సేవలందిస్తూ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని MLA వారికి సూచించారు.