SKLM: ఈనెల 30న ఎచ్చెర్ల వెంకటేశ్వర ఇంజనీర్ కాలేజీలో మెగా జాబ్ మేళా ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖాధికారి ఉరటి సాయికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహేంద్ర, మిరాకిల్ సాఫ్ట్వేర్ వంటి 14 కంపెనీల యాజమాన్యాలు వివిధ కేటగిరీలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. SSC, ఇంటర్, బీటెక్, ఐటీఐ, డిప్లమాతో పాటు పలురకాల విద్యలో పాసై ఉండాలన్నారు.