TG: చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్ర, శనివారాల్లో చలి తీవ్రత బాగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని చెబుతోంది.