KMM: ఖమ్మం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ జాబితా ఖమ్మం జిల్లా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటలలోపు DM&HO కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు.