ADB: వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహత్నూర్ మం. కొల్హారీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వర్షిత(18) ఇంటర్ పూర్తి చేసుకుని ఇంటి వద్దే ఉంటుందని తెలిపారు. అదే గ్రామానికి చెందిన సచిన్ పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేవాడని, వారు పేర్కొన్నారు. పెళ్లి సంబంధాలు రావడంతో ఎలా చేసుకుంటావో చూస్తానని బెదిరించేవాడని తెలియాజేశారు.