GNTR: తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు గురువారం స్వామివారు శ్రీ పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం నుంచి ఆలయానికి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గజ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.