BPT: చీరాల మండలం సల్మాన్ సెంటర్లోని బైర్ హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్న 90 సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్ లూక్స్ చర్చి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించబడింది. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ ఆకట్టుకుంది. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పండుగ వాతావరణంతో చర్చి పరిసరాలు సందడిగా మారాయి.