AP: మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశాభివృద్ధికి వాజ్పేయి హయాంలో ఆర్థిక, మౌలిక సంస్కరణలే కారణం. అణు పరీక్షల ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరివరకు కట్టుబడి ఉన్నారు’ అని కొనియాడారు.