అన్నమయ్య: సిద్దవటం రేంజ్ పరిధిలోని గొల్లపల్లి బీటు నల్లబండలు, సాలుపెంట అటవీ ప్రాంగణంలో అటవీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, తిరుపతి కోర్టులో హాజరు పరిచినట్లు రేంజర్ కళావతి తెలిపారు. అటవీ పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.