TG: రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో మరో 198 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 84 ట్రాఫిక్ సూపర్వైజర్స్ ట్రైనీ పోస్టులకు.. 114 మెకానికల్ సూపర్వైజర్స్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. పూర్తి వివరాలు www.tgprb.in వెబ్సైట్ను సంప్రదించండి.