NLR: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 208 అంగన్వాడీ కార్యకర్తలకు సీడీపీఓ పుణ్యవతి మొబైల్ ఫోన్లను అందజేశారు. గురువారం ఆమె ఉదయగిరిలో సెక్టార్ సమావేశం నిర్వహించి అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్రాల నిర్వహణపై దిశ నిర్దేశం చేశారు. అనంతరం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు సకాలంలో చేరేలా కేంద్రాల సమయపాలన పాటించేలా చూడాలని సూచించారు.