NLR: కలువాయి,సైదాపురం, రాపూరు మండలాలను NLR జిల్లాలోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోన్న నేపథ్యంలో గూడూరు పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గుడూరును నెల్లూరులోనే కొనసాగించాలన్న డిమాండ్ ఉంది. MLA సునీల్ తాను రాజీనామా చేస్తా అంటూ తేల్చి చెబుతున్నారు. మరి ప్రభుత్వం గూడూరును మాత్రమే ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.