NZB: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతిని చందూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు మాడిశెట్టి విట్టల్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి వాజపేయి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.