KMM: మధిర అయ్యప్ప దేవాలయ అర్చకులు మాధవయ్య గురువారం మరణించారు. ఆయన మృతితో పట్టణంలోని అయ్యప్ప భక్తుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ, భక్తిశ్రద్ధలతో సేవలు అందించే మాధవయ్య కోల్పోవడం తీరని లోటని ఆలయ పీఠం గురుస్వామి భక్తుల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ఆలయ కమిటీ సభ్యులు సంతాపం ప్రకటించారు.