ఒడిశా కందమాల్ జిల్లా గుమ్మా అటవీప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. బలగాలు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మరణించిన మావోలను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాకేశ్, అమృత్‌గా గుర్తించిన అధికారులు.. వీరిద్దరిపై రూ.24 కోట్ల రివార్డ్ ఉందని తెలిపారు.