RR: షాద్నగర్ పట్టణ సమీపంలోని కేశంపేట రైల్వే గేట్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు రైల్వే గేట్ మూసి ఉంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 31వ తేదీ నుంచి గేట్ తెరిచి ఉంటుందని, పట్టణ ప్రజలు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.