JGL: కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బుధవారం ఆర్డీవో ఆఫీస్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. 2024 ఏప్రిల్ నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.