AP: క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభువైన ఏసు క్రీస్తు జన్మించిన ఈ పవిత్ర దినం.. ప్రపంచవ్యాప్త పర్వదినం. క్రీస్తు చూపిన ప్రేమ, సహనం పాటిద్దాం.. సమాజహితానికి పాటుపడుదాం. సుఖసంతోషాలతో ఆనందమయంగా క్రిస్మస్ పండుగ నిర్వహించుకోవాలి’ అని సూచించారు.