ఖాజీపేట సమీపంలోని పుష్పగిరి వద్ద కాలభైరవ ఆలయంలో ఈనెల 28వ తేదీన అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పంచ అమృతాభిషేక పూజలు జరుగుతాయని భక్తులు పూజల్లో విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉదయం ఏడు గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు.