ASF: దహెగాం మండలం కమ్మర్పల్లికి చెందిన మేస్త్రీ శ్రీనివాస్(40) అప్పుల భారంతో బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పనులు దొరకకపోవడంతో పాటు బైక్ రుణం తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.