Brain Eating Amoeba: A brain eating amoeba is creating a stir in Kerala
Brain Eating Amoeba: ప్రస్తుతం కేరళలో అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్(మెదడు తినే అమీబా) కలకలం రేపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిన ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. బాలుడు చెరువులో స్నానం చేస్తుండగా అమీబా ముక్కు ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. అలా మెదడుకు సోకుతుంది. మొదడు కణజాలాలను దెబ్బతీస్తుంది. దీంతో వ్యాధి ప్రాణాంతకం అవుతుంది.
ఈ వ్యాధి బారిన పడిన తర్వాత రెండు నుంచి 15 రోజుల తర్వాత దీని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, తీవ్ర జ్వరం, వికారం, వాంతి, గట్టి మెడ, చూడటంలో ఇబ్బంది, గందరగోళం, సమతుల్యం చేయలేకపోవడం, కోమా అన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా లక్షణాలే. చెరువులు లేదా స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ ఏడాది మేలో మలప్పురంలో ఐదేళ్ల ఓ బాలిక, జూన్‌లో కన్నూర్‌లో 13 ఏళ్ల మరో బాలిక ఇదే వ్యాధితో మరణించింది. 2017, 2023ల్లో అలప్పుజ జిల్లాలో అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ కేసులు నమోదయ్యాయి. బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల గత రెండు నెలల్లో మొత్తం మూడు మరణాలు సంభవించాయి.