కేరళ రాష్ట్రానికి వరదలు తీవ్ర విషాదాన్ని మిగిలిచాయి. మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. వాయనాడ్ జిల్లాలోని మండక్కై, చురాల్మల ప్రాంతాలలో జనాలు తమ కుటుంబసభ్యులను పోగుట్టుకుని, వారి ఆచూకీ ఏమయ్యిందో తెలియక శోకసంద్రాలు, ఆక్రందనలే వినిపించాయి. జూలై 30వ తేదీ వరదలు అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండక్కై ప్రాంతానికి వెళ్ళే మార్గంలో ఉన్న బ్రిడ్జి వరద ఉధృతిలో కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది.
మలయాళ మనోరమ పత్రిక కథనం ప్రకారం ఇప్పటివరకు 270 మందికి పైగా ఈ హృదయ విచారక ఘటనలో ప్రాణాలు విడిచారు. 200 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు, 200 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చనిపోయిన వారిలో 22 మంది చిన్నపిల్లలు ఉండటం అత్యంత బాధకార విషయం.
పూర్తిగా టూరిజం, వ్యాపారం పైనే ఆధారం:
వాయనాడ్ జిల్లా అంటేనే టూరిజం కు మారు పేరు.. అందులోనూ మండక్కై, చూరాల్మల ప్రాంతాల్లో అధిక సంఖ్య జనాభా టూరిస్టుల మీద ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం బురద, రాళ్ళ బండలు, నిట్టనిలువునా చీలిపోయిన ప్రాంతాలు, పూర్తిగా ద్వాంసమైన ఇళ్లతో అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ‘మా వాళ్ళు అంతా పోయారు, మాకు చెప్పుకోవడానికి ఏమి మిగల్లేదు.. శాంతం కోల్పోయాం’ అంటూ ఒక పెద్దాయన తమ వారి ఆచూకీ తెలియక విచారం వ్యక్తం చేశారు.
మండక్కై, చూరలమాల ప్రాంతంలో వరద ఉధృతిలో కొట్టుకుపోయిన వారిలో చాలా మంది చనిపోయారు… వారి మృతదేహాలు 90 కిలోమీటర్ల దాటాక నదిలో గుర్తుపట్టారు… ఈ వరదల విధ్వసం ఎంత అనేది ఈ ఒక ఘటనతో తెలుస్తుంది. కేరళలో ఇలాంటి భారీ విధ్వసం మునుపెన్నడూ జరగలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. గురువారం కేరళ వరద ప్రాంతాలను లోక్ సభ ప్రతిపక్ష నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. 2018 కేరళ వరదల వాళ్ళ 485 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ ప్రాణనష్టం సంభవించిన వరదలు అవే. ఆనాటి హృదయ విచారక ఘటనలు మరవక ముందే ఆరేళ్లలో ఇప్పుడు మరో ఘటన సంభవించింది