PDPL: పాలకుర్తి మండలం కన్నాల రైల్వే గేటును, ఈనెల 29 వరకు మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 29 వరకు కన్నాల లెవెల్ క్రాసింగ్ 46 వద్ద 3వ రైల్వే ట్రాక్ బేస్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నందున గేట్ క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కావున ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ దారిని ఎంచుకుని రైల్వే శాఖకు సహకరించాలన్నారు.