»Raj Tarun Case Lavanyas Message That I Cant Live Without Raj Is Committing Suicide
Raj Tarun Case: రాజ్ లేని జీవితంలో నేను ఉండలేనని.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావణ్య సందేశం
సినీ నటుడు రాజ్‌తరుణ్ ప్రేమించి మోసం చేశాడని అతని ప్రియురాలు లావణ్య అతనిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే లావణ్య నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తన అడ్వకేట్‌కు సందేశం పంపించింది.
Raj Tarun Case: Lavanya's message that I can't live without Raj.. is committing suicide
Raj Tarun Case: సినీ నటుడు రాజ్‌తరుణ్ ప్రేమించి మోసం చేశాడని అతని ప్రియురాలు లావణ్య అతనిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈక్రమంలో ఆమె నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తన అడ్వకేట్‌కు సందేశం పంపించింది. నేను వెళ్లిపోతున్నానంటూ అందులో తెలిపింది. దీంతో అతని లాయర్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అర్థరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
నేను అంటే ఏంటో తెలిసిన వాళ్లు కూడా తనని తప్పుబట్టారని బాధపడింది. రాజ్ లేని ఈ లైఫ్‌లో నేను ఉండలేనంది. ఇంకా బతకలేను. జీవితంలో అన్ని కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయానంది. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ ఇప్పుడు మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. నేను అంటే తనకి ఇప్పుడు ఇష్టం లేదు. మాల్వీ మల్హోత్ర కూడా తన చావుకు కారణమని తెలిపింది. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు క్షమాపణలు అంటూ అడ్వకేట్‌కు నోటీసు పంపించింది. దీంతో పోలీసులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.