CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గో సంరక్షణ ట్రస్ట్‌కు గుంటూరు వాస్తవ్యులు శ్రీరామ్-అపర్ణ దంపతులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఏఈవో రవీంద్రబాబు ఆధ్వర్యంలో దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

