PLD: దశాబ్దాల కల వరికపూడిశెల ప్రాజెక్టుకు మరిన్ని అనుమతులు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.150 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని, రహదారుల విస్తరణతో మాచర్లను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.

