»Ram Charan The Game Is About To Change Ram Charans Post Goes Viral
Ram Charan: గేమ్ మారబోతోంది.. రామ్ చరణ్ పోస్ట్ వైరల్!
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోస్‌ను ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవగా.. ఇప్పుడు చరణ్ కూడా పోస్ట్ చేశాడు.
Ram Charan: The game is about to change.. Ram Charan's post goes viral!
Ram Charan: తాజాగా జరిగిన భారతీయుడు 2 ఈవెంట్లో గేమ్ చేంజర్ గురించి చెప్పుకొచ్చాడు దర్శకుడు శంకర్. ఎప్పటినుంచో తెలుగు ఆడియెన్స్ కోసం స్ట్రెయిట్ పిక్చర్ చేయాలని అనుకుంటున్నాను.. అది గేమ్ చేంజర్‌తో కుదిరింది. రామ్ చరణ్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది, చరణ్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా.. అనేలా ఉంటుంది. ఇంకా 10-15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది.. అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో చరణ్ షేర్ చేసిన పిక్ పిచ్చెక్కించేలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హెలికాప్టర్ వైపు నడుస్తున్న రెండు ఫోటోస్ షేర్ చేశాడు చరణ్. ఇందులో ఒకటి సినిమాలోనిది కాగా, మరొకటి షూట్ పూర్తయిన తర్వాత తీసిన పిక్. ఈ పోస్ట్‌కి ‘గేమ్ మారబోతోంది’ అని క్యాప్షన్ ఇచ్చాడు. చిత్ర నిర్మాణ సంస్థ కూడా గేమ్‌ఛేంజర్‌లో రామ్ చరణ్ షూటింగ్.. మొదటి రోజు నుండి చివరి వరకు మెగా పవర్ ప్యాక్డ్ జర్నీగా సాగింది. త్వరలో సాలిడ్ అండ్ క్రేజీ అప్డేట్ ఇస్తామని.. పోస్ట్ పెట్టింది.
ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత.. ఈ హెలికాప్టర్ సీన్‌కు థియేటర్లు మామూలుగా ఉండదని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమాలో చరణ్ తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్‌గా అప్పన్న పాత్ర ఒకటి కాగా.. రామ్ నందన్ కలెక్టర్‌గా మరో పాత్ర చేస్తున్నాడు. రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోలు రామ్ నందన్‌కు సంబంధించినవి. ఈ సీన్ చరణ్ ఇంట్రో సీన్ అనే టాక్ వినిపిస్తోంది.