»Kalki 2898 Ad Kalki Collections Another Hundred Crore Sensation
Kalki 2898 AD: ‘కల్కి’ కలెక్షన్స్.. మరో వంద కోట్లైతే సెన్సేషన్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ.. భాషతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సెకండ్ వీక్‌లోను అదిరిపోయే ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. దీంతో.. 11 రోజుల్లో వెయ్యి కోట్లకు చేరువలో ఉంది కల్కి.
Kalki 2898 AD: 'Kalki' Collections.. Another Hundred Crore Sensation?
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ సినిమా.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ వసూళ్లను రాబోతోంది. బాలీవుడ్లో 11 రోజులకు గాను 200 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో.. హిందీలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా దూసుకుపోతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోను లాభాల బాట పట్టింది కల్కి. ఇక అమెరికాలో అయితే.. కల్కి ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు.
ఇప్పటికే నార్త్ అమెరికాలో 16 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో.. రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ RRR మూవీ టోటల్ రన్ కలెక్షన్స్‌ని బ్రేక్ చేసింది. అలాగే.. అనిమల్, జవాన్ సినిమాల టోటల్ రన్ కలెక్షన్స్‌ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పట్లో అమెరికగా గడ్డపై కల్కి జోరు తగ్గేలే లేదనే చెప్పాలి. ఇక సెకండ్ వీకెండ్లో భారీ ఆక్యుపెన్సీతో అదరగొట్టింది కల్కి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 900 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది కల్కి.
ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో వంద కోట్లు వస్తే.. వెయ్యి కోట్లు రాబట్టి.. ప్రభాస్‌కు సెన్సేషన్ హిట్ ఇచ్చేలా ఉంది కల్కి. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన సినిమాల్లో బాహుబలి మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో ఉంది. ఇప్పుడు కల్కి మరో వెయ్యి కోట్ల బొమ్మగా నిలవబోతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఫిల్మ్‌కు ఫిదా అవుతున్నారు ఆడియెన్స్. అందుకే.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మరి లాంగ్ రన్లో ఎంత రాబడుతుందో చూడాలి.