Bihar: బిహార్‌లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో పిడుగు పాటుకు గడిచిన 24 గంటల్లో 12 మంది మరణించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు బిహార్ సీఎం కార్యాలయం తెలిపింది. భారీ వర్షాలకు చాలా జిల్లాల్లో వరద నీరు చేరింది. సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కూడా భారీ వర్షాలకు నీట మునిగింది. అస్సోం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు చాలా ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బ్రహ్మపుత్ర నది పోటెత్తడంతో రాష్ట్రంలో ప్రధాన నదులకు వరద నీరు పోటెత్తింది.