EG: ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా భూసంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్లో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అర్జీదారులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.