యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని దర్శకుడితో తారక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇంతకీ ఎవరా దర్శకుడు? అసలు కథేంటి?
NTR: ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి షాక్ ఇచ్చేలా ఉంది. అసలు.. ఇదెక్కడి కాంబో? అనేలా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాలతో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. మధ్యలో హృతిక్ రోషన్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసి.. అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం దేవర పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్.. త్వరలోనే వార్ 2 కూడా పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
అయితే.. ఈ సినిమాల తర్వాత దేవర పార్ట్ 1 రిజల్ట్‌ని బట్టి.. పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఓ ఊహించని దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడనే టాక్ బయటికొచ్చింది. అది కూడా ఒక్క సినిమా చేసిన క్లాస్ డైరెక్టర్‌తో అనేది షాకింగ్‌గా మారింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఈయనకే ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ మూవీ ప్రొడ్యూస్ చేసిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చెయ్యనుందని టాక్.
ఇప్పటికే ఎన్టీఆర్‌కు కథ వినిపించగా.. నచ్చడంతో ఫైనల్ డ్రాఫ్ట్ తీసుకురమ్మని చెప్పారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, టైగర్ కోసం పాన్ ఇండియా డైరెక్టర్స్ వెయిట్ చేస్తుంటే.. శౌర్యువ్‌కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడమనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఓకె అవుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఫైనల్‌గా టైగర్‌కి స్టోరీ నచ్చితే మాత్రం.. ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.