ప్రధాన మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే రూ. 5,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో రూ.2,500 కోట్ల విలువైన నగరాభివృద్ధి పనులు, గాంధీనగర్‌లో రూ.1100 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఆధునిక మౌలిక సదుపాయాలు గుజరాత్‌ను వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహిస్తాయని మోదీ అన్నారు.